రక్ష గౌడ వెకేషన్ ఫోటోలు.. గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి షాక్!
on Oct 8, 2024
అందమైన చందనాల బొమ్మరా అని పాడాలనిపచేలా గుప్పెడంత మనసు సీరియల్ లో కన్పించిన వసుధార అలియాస్ రక్ష గౌడ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలని షేర్ చేసింది.
ఆ ఫోటోలని గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ చూస్తే షాక్ అవుతారు. ట్రెండీ లుక్ లో పొట్టి బట్టల్లో ఫోటోలకి ఫోజులిచ్చింది ఈ భామ. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషికి జోడీగా రిషీధాలుగా కలిసి ఉన్నారు వీరిద్దరి జోడికి ఇన్ స్టాగ్రామ్ లో బోలెడంత ఫ్యాన్స్ ఉన్నారు. ఆన్ స్క్రీన్ మీద వీరిద్దరి జోడి ఎంత పెద్ద హిట్టో ఆ సీరియల్ టీఆర్పీ చూస్తే తెలుస్తుంది.
రక్ష తాజాగా మలేషియా వెకేషన్‌కి వెళ్లింది. అక్కడ రక్ష అక్కడి ఫొటోలు పంచుకుంది. ఇందులో చిన్న డ్రెస్ లో కనువిందు చేసింది. అయితే కొందరు భలే క్యూట్‌గా ఉందనగా.. మరికొందరు ఇలాంటివి పోస్ట్ చేయకండి అంటు కామెంట్లు పెడుతున్నారు. ఇక రిషి, వసుధారల కాంబినేషన్ లో మరో సీరియల్ కావాంటే ' గుప్పెడంత మనసు' సీరియల్ ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు.
Also Read